విశ్వక్‌సేన్‌ ‘పాగల్‌’ విడుదల తేదీ ఖరారు - paagal arriving to steal your hearts from april 30 in theatres
close
Updated : 02/02/2021 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశ్వక్‌సేన్‌ ‘పాగల్‌’ విడుదల తేదీ ఖరారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతి తక్కువ కాలంలోనే యువతలో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న నటుడు విశ్వక్‌సేన్‌. ఇటీవల నానితో కలిసి ‘హిట్‌’ సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు ‘పాగల్‌’గా మారి మరోసారి అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నరేశ్‌ కొప్పిలి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కాగా.. చిత్రబృందం ఈ సినిమాలో హీరో ఫస్ట్‌లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పింది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు.

‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు విశ్వక్‌సేన్‌. ఇటీవల ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా వచ్చిన థ్రిల్లర్‌ ‘హిట్‌’ ప్రేక్షకులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. దాని తర్వాత విశ్వక్‌సేన్‌ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో గత సినిమాలకంటే భిన్నంగా లవర్‌బాయ్‌లా విశ్వక్‌ కనిపించనున్నట్లు ఫస్ట్‌లుక్‌ను బట్టి అర్థమవుతోంది. ‘అందాలరాక్షసి’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలకు సంగీతం అందించిన రాధన్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

ఇవీ చదవండి..

‘అబ్బే ఆడదండీ’ అన్నవారంతా అవాక్కయ్యారు!

‘ఆదిపురుష్‌’ ఆరంభం అంటున్న ప్రభాస్‌!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని