Raamz: క్యాస్టూమ్ డిజైన‌ర్.. ఇక‌పై హీరో - pachchis movie fame raamz interview
close
Published : 12/06/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raamz: క్యాస్టూమ్ డిజైన‌ర్.. ఇక‌పై హీరో

ఇంట‌ర్నెట్ డెస్క్‌: టాలీవుడ్ సెలబ్రిటీ డిజైన‌ర్ రామ్స్ ‘ప‌ఛ్చీస్’ అనే చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.  క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో శ్రీ కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా తెర‌కెక్కించారు. జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్  కానుంది. ఈ సంద‌ర్భంగా రామ్స్ చెప్పిన సంగ‌తులివీ...

వాళ్ల ప్రోత్సాహం..

నా స్వ‌స్థ‌లం భీమ‌వరం. సినిమా అంటే ప్యాష‌న్‌. సినిమాల్లోకి వెళ్తానంటే ఏ త‌ల్లిదండ్రులైనా వ‌ద్దంటారు. కానీ, నాకు అలాంటి అనుభ‌వం ఎదుర‌వ‌లేదు. ప్ర‌స్తుతం నేను ఇలా ఉన్నానంటే నా త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. హీరో అవుదామ‌నే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాను. కానీ, ముందుగా మ‌న‌కంటూ ఇక్క‌డ ఓ గుర్తింపు ఉండాల‌నుకున్నాను. దాంతో క్యాస్టూమ్ డిజైన‌ర్‌గా మారాను. నాగార్జున‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రామ్‌, అడివి శేష్‌, రానా.. ఇలా టాలీవుడ్‌లో దాదాపు 75 శాతం మంది హీరోల‌కు క్యాస్టూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేశాను.

అందరూ కొత్తవాళ్ల‌మే..

అలా కొన్నాళ్లు ప‌నిచేశాక న‌టుడిగా మారాల‌నుకున్నాను. ఓ మంచి క‌థ కోసం ఎదురు చేస్తున్న స‌మ‌యంలో ద‌ర్శ‌కులు సాయి కృష్ణ‌, రామసాయి క‌లిశారు. వాళ్లు చెప్పిన థ్రిల్ల‌ర్ స్టోరీ నాకు బాగా న‌చ్చింది. అదే ‘ప‌ఛ్చీస్’గా త్వ‌ర‌లో మీ ముందుకు రాబోతుంది. చిత్ర బృందంలో దాదాపు అంద‌రం కొత్త వాళ్ల‌మే. ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. క‌థ‌, క‌థ‌నం కొత్త‌గా ఉంటాయి. ఈ చిత్రం మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది.

జ‌య‌ప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా..

రానా, నాగార్జున, అడివి శేష్ తదిత‌రులు ఈ సినిమాకి స‌పోర్ట్ ఇచ్చారు. వీరి ప్రోత్సాహం లేకపోతే మా సినిమా ఇంత మందికి చేరువ‌య్యేది కాదు. ట్రైలర్‌ చూసిన వారందరు బాగుందని చెబుతుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమాను థియేటర్ల‌ల‌లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. ప్రస్తుతం నెల‌కొన్న పరిస్థితుల దృష్ట్యా ఓటీటీ వైపు వెళ్లాం. మ‌రో రెండు సినిమాల‌కు సంత‌కం చేశాను. రెండూ విభిన్న నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నాయి. ఓ మంచి న‌టుడిగా ప్రేక్ష‌కుల గుర్తింపు పొందాక క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల గురించి ఆలోచిస్తా. జ‌య‌ప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినీ ప్ర‌యాణాన్ని కొన‌సాగించాల‌నుకుంటున్నా.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని