స్టూడియో చూపించడానికి వెళ్తే.. నటుడయ్యారు - padmanabham got the chance in telugu movie
close
Published : 28/03/2021 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టూడియో చూపించడానికి వెళ్తే.. నటుడయ్యారు

ఇంటర్నెట్‌డెస్క్‌: హాస్య నటుడు పద్మనాభం ‘రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌’ నాటక సంస్థను స్థాపించి ‘శాంతి నివాసం’ నాటకాన్ని ప్రదర్శిస్తున్న రోజులవి. ఓ రోజు మద్రాసుకు వచ్చిన డ్రామా కాంట్రాక్టర్లకు సినిమా స్టూడియోలు చూపిస్తూ వాహినీలోకి అడుగుపెట్టారాయన.

అదే సమయంలో అక్కడ ‘వెలుగు నీడలు’లో ఏయన్నార్‌ మిత్రబృందం పాడే ‘భలే భలే మంచి రోజులులే..’ పాట చిత్రీకరణ జరుగుతోంది. అందులో నటిస్తున్న హాస్యనటుడు సారథి వరసగా టేకులు తినడంతో నిర్మాత దుక్కిపాటికి విసుగెత్తింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పద్మనాభంని చూస్తూనే ‘నువ్విప్పుడు వేసుకున్న డ్రెస్‌ బాగుంది. వెంటనే మేకప్‌ చేయించుకో’ అంటూ సారథి పాత్రలో పద్మనాభాన్ని తీసున్నారు.

‘కర్నూలు ఎక్కడ, కాకినాడ ఎక్కడ...’ అంటూ ఆరంభమయ్యే సాకీని ఆయన మీద చిత్రించారు. అది ఆయనకు గుర్తింపును తీసుకొచ్చింది. చలనచిత్ర హాస్యనట జీవితానికి గట్టి పునాదులు వేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని