‘పైన పటారం..’ అంటున్న అనసూయ - paina pataaram kartikeya chaavu kaburu challaga
close
Published : 01/03/2021 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పైన పటారం..’ అంటున్న అనసూయ

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. విను బాసు చెబుతా.. ఈ లోకమెవ్వారం’ అంటూ అనసూయ మాస్‌ స్టెప్‌లతో అదరగొట్టారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. యాంకర్ అనసూయ ఇందులో ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జేక్స్‌బిజోయ్‌ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ‘‘బస్తీ బాలరాజు’’ వంటి పాటలు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మురళీ శర్మ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని