అది ‘చైనా సరకే’! - pak comments on china vaccine
close
Published : 05/02/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది ‘చైనా సరకే’!

60 ఏళ్లు పైబడినవారిపై పనిచేయని డ్రాగన్‌ టీకా
 పాకిస్థాన్‌ వెల్లడి 

ఇస్లామాబాద్‌: కొవిడ్‌-19 నివారణకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్‌ తయారుచేసిన టీకా పనితీరు అంతంతమాత్రమేనని వెల్లడైంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. డ్రాగన్‌కు అత్యంత సన్నిహిత దేశమైన పాకిస్థాన్‌. 60 ఏళ్లు పైబడినవారిపై సినోఫార్మ్‌ టీకా సమర్థంగా పనిచేయడంలేదని తెలిపింది. పాక్‌కు 5లక్షల సినోఫార్మ్‌ టీకాలను చైనా విరాళంగా ఇచ్చింది. సోమవారం వాటిని చేరవేసింది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రాథమిక డేటాను పాక్‌ నిపుణుల కమిటీ విశ్లేషించింది. వాటి ఆధారంగా ఈ టీకాను 18-60 ఏళ్లు వయసు వారికే సిఫార్సు చేసింది. ప్రధాన మంత్రికి ప్రత్యేక సలహాదారు ఫైజల్‌ సుల్తాన్‌ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. 60 ఏళ్లు పైబడ్డ వారికి ఈ వ్యాక్సిన్‌ను వేయవద్దని కమిటీ సూచించినట్లు తెలిపారు. టీకా సామర్థ్యంపై మరింత డేటా అందుబాటులోకి వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పాక్‌లో బుధవారం నుంచి కరోనా టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది. చైనా కంపెనీలు ప్రస్తుతం 16 టీకాలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో సినోఫార్మ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌కు చైనా ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఈ టీకాతోపాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లకు పాక్‌లో అనుమతి లభించింది. 

ఇవీ చదవండి..
భారత్‌లో వెనక్కి తగ్గిన ఫైజర్!

భారత్‌లో క్రియాశీల రేటు..1.40 శాతంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని