భారత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ఇమ్రాన్‌ - pak pm imran khan solidarity with indian people who fight with corona virus
close
Published : 25/04/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతిపై పోరాటం చేస్తున్న భారత ప్రజల పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంఘీభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహమ్మారితో పోరాడుతున్న అన్ని దేశాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘కరోనా వైరస్‌ రెండో దశపై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. పొరుగుదేశం సహా ఇతర అన్ని దేశాలు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సవాలుపై అందరూ కలసికట్టుగా యుద్ధం చేయాలి’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్‌లో పిలుపునిచ్చారు.  

భారత్‌లో కరోనా వైరస్‌ రెండోదశ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం లక్షలాది మంది కొత్తగా వైరస్ బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 1,89,544 మంది ప్రాణాలు వదిలారు. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల అధినేతలు భారత్‌ పట్ల సంఘీభావం ప్రకటించారు. భారత్‌కు ఏవిధంగానైనా సాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని