కాల్పుల విరమణకు కట్టుబడతాం - pakistan india agree on strict observance of all agreements cease firing along loc
close
Published : 25/02/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాల్పుల విరమణకు కట్టుబడతాం

భారత్‌-పాక్‌ సంయుక్త ప్రకటన

దిల్లీ: నియంత్రణ రేఖతో పాటు ఇతర సెక్టార్లలో కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించి కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్‌- పాక్‌ నిర్ణయించాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనను గురువారం విడుదల చేశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి.ఈ మేరకు మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంవో) స్థాయిలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత్‌ -పాక్‌ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో హాట్‌లైన్‌ ద్వారా డీజీఎంవో స్థాయిలో ఈ సమావేశం జరిగింది. సరిహద్దుల్లో శాంతిస్థాపన కోసం నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై చర్చిచామని సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు వెల్లడించాయి. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో లోక్‌సభలో ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడేళ్లలో పాక్‌ మొత్తం 10,752 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని, ఇందులో 72 మంది భద్రతా సిబ్బంది, 70 మంది పౌరులు మరణించినట్లు వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని