Ind-Pak: భారత కంపెనీలతో వ్యాపారం చేయం: పాక్‌ - pakistan minister says they cant do business with indian companies on the basis of revocation of jammu kashmir special status
close
Published : 09/06/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ind-Pak: భారత కంపెనీలతో వ్యాపారం చేయం: పాక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే నెల ఇంగ్లాండ్‌ పర్యటనలో పాకిస్థాన్‌ ఆడే ఆరు పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లను తమ దేశంలో ప్రసారం చేయబోమని పాక్‌ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మంత్రి ఫవాద్‌ చౌదరి వెల్లడించారు. దక్షిణాసియాలో క్రికెట్‌ ప్రసార హక్కులను భారత కంపెనీలైన ‘స్టార్‌, ఆసియా’ ఛానెళ్లు దక్కించుకున్న నేపథ్యంలో వాటితో వ్యాపారం చేయడంలేదని తెలిపారు. ఇందుకు కారణం 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దుచేయడమేనన్నారు. భారత్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాకే ఆయా కంపెనీలతో వ్యాపారం చేస్తామని పాక్‌ మంత్రి పేర్కొన్నారు. ఈ చర్యవల్ల పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకు నష్టం చేకూరుతుందని, అయినా తమ నిర్ణయంలో మార్పు ఉండబోదని తెలిపారు. 

మరోవైపు ఇంగ్లిష్‌ జట్టుతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20లను తమ దేశంలో ప్రసారం చేసేందుకు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ విషయంలో భారత్‌ నిర్ణయం వెనక్కి తీసుకున్నాకే ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. కాగా, పాక్‌ జులై 8, 10, 13 తేదీల్లో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా.. 16, 18, 20 తేదీల్లో మూడు టీ20లు జరగాల్సి ఉన్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని