ఫస్ట్‌క్లాస్‌ To టెస్ట్‌ క్రికెట్‌.. 18 ఏళ్లు పట్టింది! - pakistan player tabish khan played his first test after 18 long years of first class debut
close
Published : 09/05/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫస్ట్‌క్లాస్‌ To టెస్ట్‌ క్రికెట్‌.. 18 ఏళ్లు పట్టింది!

కొత్త రికార్డు సృష్టించిన తబిష్‌ ఖాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ ఆటగాడు తబిష్‌ ఖాన్‌ సరికొత్త చరిత్ర సృష్టిచాడు. 36 ఏళ్ల వయసులో పాక్‌ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయడమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేసిన తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసి అందర్నీ ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌ ప్రస్తుతం జింబ్వాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో మ్యాచ్‌లో తబిష్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే, శనివారం అతడు తొలిసారి బౌలింగ్‌ చేయగా మొదటి ఓవర్‌లోనే వికెట్‌ పడగొట్టి రికార్డు నెలకొల్పాడు.

ఇంకో విశేషం ఏమిటంటే.. తబిష్‌ తొలి టెస్టు ఆడకముందే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 18 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం సేవలందించాడు. ఈ క్రమంలో ఆసియాలో తొలి టెస్టు ఆడకముందే అత్యధిక ఫస్ట్‌క్లాస్‌ వికెట్లు (598) తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. గత 70 ఏళ్లలో టెస్టు క్రికెట్‌లో బౌలింగ్‌ చేసిన తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీసిన అతిపెద్ద వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు. 1951లో దక్షిణాఫ్రికా ఆటగాడు జీడబ్ల్యూ చుబ్‌ 40 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌పై తొలి వికెట్‌ సాధించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని