పాక్‌లో చైనా టీకా తయారీ - pakistan starts production of cansino chinas single dose jab
close
Updated : 25/05/2021 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో చైనా టీకా తయారీ

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా తన వ్యాక్సిన్‌ వినియోగాన్ని పాకిస్థాన్‌లో విస్తరిస్తోంది. తాజాగా చైనా కాన్‌సినో కొవిడ్-19 టీకా తయారీని పాకిస్థాన్‌లో ప్రారంభించింది. ఇది సింగిల్‌డోస్‌ వ్యాక్సిన్‌. పాకిస్థాన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో ఈ వ్యాక్సిన్‌ తయారీ ప్లాంట్‌ను ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో నెలకు 30లక్షల టీకాలను తయారు చేయనున్నారు. దీంతో పాకిస్థాన్‌ టీకా దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మేనెల చివరి నాటికి టీకాల మొదటి బ్యాచ్‌ అందుబాటులోకి రానుంది.   ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ప్రత్యేక సహాయకుడు ఫైసల్‌ సుల్తాన్‌ ఈ విషయంపై ట్వీట్‌ చేశారు. తమ కొవిడ్‌ టీకాల అవసరాలను ఇది భారీగా తీరుస్తుందని పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు చైనా నుంచి దిగుమతి చేసుకొన్న టీకాల్లో 91శాతం కొనుగోలు చేయగా.. 9శాతం బహుమతిగా లభించాయి. పాక్‌లో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలను వేస్తున్నారు. ‘‘పాకిస్థాన్‌ ఇప్పటికే 30 మిలియన్‌ డోసుల టీకాల కొనుగోలుకు డీల్స్‌ కుదుర్చుకొంది. ఈ ఏడాది చివరి వరకు కొనుగోళ్లు ఆగవు. ఇది ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంది’’ ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని