సామాజిక మాధ్యమాలపై పాక్‌ నిషేధం - pakistan suspends services of social media platforms following violent protest
close
Published : 16/04/2021 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సామాజిక మాధ్యమాలపై పాక్‌ నిషేధం

ఇస్లామాబాద్‌: సామాజిక మాధ్యమాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఫ్రాన్స్ పత్రికలకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ర్యాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఫ్రాన్స్ పత్రికలు దైవ దూషణకు పాల్పడ్డాయంటూ ఆ పార్టీకి చెందిన వేలాది మంది మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఇష్టారీతిలో దాడులకు తెగబడుతున్నారు. 

నిరసనలు హింసాత్మకంగా మారడంతో అప్రమత్తమైన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజకీయ నేతలు సోషల్‌ మీడియా వేదికగా నిరసనకారులకు మద్దతు ఇస్తున్నారంటూ.. వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని