నిశ్చితార్థమయ్యాక బ్రేకప్‌ చెప్పిన నటి - pakistani actress saba qamar calls off wedding with fiance after sexual harassment row
close
Updated : 03/04/2021 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిశ్చితార్థమయ్యాక బ్రేకప్‌ చెప్పిన నటి

సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టిన సబా

ముంబయి: ఇర్ఫాన్‌ఖాన్‌‌ ప్రధాన పాత్రలో నటించిన ‘హిందీ మీడియం’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్థానీ నటి సబా కమర్‌. వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. కాగా, తాజాగా ఈ భామ పెళ్లికి బ్రేకప్‌ చెబుతున్నట్టు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది.

‘‘వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్ ఖాన్‌తో నా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత బ్రేకప్‌ చెప్తున్నాను. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటివరకూ నన్ను సపోర్ట్‌ చేసిన మీరందరూ ఇకపైనా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ఆలస్యం కాకుండా సరైన సమయంలోనే చేదు నిజాలను గ్రహించాను! అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ‘నేను అజీమ్‌ఖాన్‌ను ఇప్పటివరకూ కలవలేదు. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే మేమిద్దరం మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా ఇది నాకెంతో కఠినమైన సమయం’’ అని ఆమె పేర్కొన్నారు.

కాగా, సబా పెట్టిన పోస్టుపై అజీమ్‌ స్పందించారు. ‘సబా.. నువ్వు మంచి మనస్సున్న వ్యక్తివి. ఈ భూమ్మీద ఉన్న సంతోషమంతా నీకు దక్కాలని ఆశిస్తున్నాను. దేవుడు నీకు అన్నివేళలా విజయాన్నే అందించాలని కోరుకుంటున్నా. ముళ్లబాట చిట్టచివరికి అందమైన గమ్యస్థానానికి చేరుస్తుంది. అలాగే ఈ బ్రేకప్‌ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా’ అని రిప్లై ఇచ్చారు. మరోవైపు, అజీమ్‌కు సబాతో ఎంగేజ్‌మెంట్‌ జరిగిన కొన్ని రోజులకే అతనిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అజీమ్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సబా ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని