మోసగాళ్లని పట్టుకునే లేడీ డిటెక్టివ్‌లు - pakistani web series in inidan ott
close
Published : 30/07/2020 03:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోసగాళ్లని పట్టుకునే లేడీ డిటెక్టివ్‌లు

భారత్‌లో విడుదల కానున్న పాకిస్థానీ వెబ్‌ సిరీస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా మన సినిమాలు పాకిస్థాన్‌లో విడుదలవుతుంటాయి. కానీ త్వరలో ఓ పాకిస్థాన్‌ వెబ్‌సిరీస్‌ భారత ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన జిందగీ ఛానెల్‌లో ఎక్కువగా పాకిస్థాన్‌కు చెందిన సీరియళ్లు.. వెబ్‌సిరీస్‌లు ప్రసారమవుతుంటాయి. అయితే తాజాగా జిందగీ.. పాకిస్థాన్‌లో ‘చురైల్స్‌’అనే వెబ్‌సిరీస్‌ను తీసింది. దీనికి పాకిస్థాన్‌ దర్శకుడు అసీం అబ్బాసీ దర్శకత్వం వహించారు. ఆ దేశానికి చెందిన నటీమణులు సర్వాత్‌ గిలానీ, నిర్మా బుచా, మెహర్‌ బానో, యాస్రా రజ్వీ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఆగస్టు 11న భారత్‌లో జీ5 వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది.

భార్యలను మోసం చేస్తున్న భర్తలను పట్టుకునేందుకు నలుగురు మహిళలు కలిసి ఓ డిటెక్టీవ్‌ ఏజెన్సీని ప్రారంభిస్తారు. అయితే వారి ఆపరేషన్లలో కేవలం మోసపోతున్న భార్యలే కాదు.. లైంగిక వేధిపులను ఎదుర్కొంటున్న మహిళలు, చిన్నారులు.. ధనవంతుల అహంకారం ఇలా ఎన్నో కోణాలను బయటపడతాయి. వీటి నుంచి మహిళలను ఎలా కాపాడారన్నదే కథాంశం. వంచనలను, పురుషాధిక్య సమాజాన్ని, మహిళలపై ఆంక్షలు, హక్కులను నిలదీసే విధంగా ఈ వెబ్‌సిరీస్‌ ఉంటుందని దర్శకుడు అసీం అబ్బాసీ తెలిపారు. సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలిసారి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టిన అబ్బాసీ గతంలో దర్శకత్వం వహించిన ‘కేక్‌’ చిత్రం పాకిస్థాన్‌ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ కావడం విశేషం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని