నన్ను గుర్తుతెస్తున్న పంత్‌: వీరూ - pant reminds me says sehwag
close
Published : 31/03/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నన్ను గుర్తుతెస్తున్న పంత్‌: వీరూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌ సారథి రిషభ్ పంత్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్‌ సిరీసులో అతడి ప్రదర్శన అద్భుతమని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌, భయపడని మనస్తత్వంతో యువకుడిగా తన క్రికెట్‌ రోజుల్ని గుర్తుకు తెస్తున్నాడని తెలిపాడు. భవిష్యత్తు భారత సూపర్‌స్టార్‌గా ఎదిగేందుకు కొన్ని సూచనలు చేశాడు.

‘ఇంగ్లాండ్‌ సిరీస్‌ ద్వారా తెలిసిన సానుకూల విషయం ఏంటంటే రిషభ్‌ పంత్‌ ఆటతీరు. వన్డేల్లో అతడు మిడిలార్డర్‌లో వచ్చి రెండో పవర్‌ప్లేను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అతడు జట్టులో కొనసాగేందుకు ఇదెంతో కీలకం. సానుకూల దృక్పథంతో ఉండటం అవసరం. క్రికెటర్‌గా అతడు నా తొలిరోజుల్ని గుర్తుకు తెస్తున్నాడు. అవతలివాళ్లు ఏం అంటున్నారో పట్టించుకోకుండా క్రీజులోకి వెళ్లి బ్యాటింగ్‌ చేస్తాడు’ అని వీరూ అన్నాడు.

తన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలిస్తే రిషభ్‌ పంత్‌ భవిష్యత్తు భారత సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. అందుకు అతడు మొత్తం 50 ఓవర్లు ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. 70-80 పరుగుల్ని శతకాలుగా మలవడం తెలుసుకోవాలని పేర్కొన్నాడు. పిచ్‌, బౌలర్‌, దేశంతో సంబంధం లేకుండా అన్ని పరిస్థితుల్లో ఆడటం అలవాటు చేసుకోవాలన్నాడు.

‘పంత్‌ ఐపీఎల్‌లో పరుగులు చేయలేనప్పుడు ఆటతీరులో ఏదో మార్చుకున్నాడు. అందుకే టెస్టుల్లో పరుగులు చేయగలిగాడు. ఒకవేళ వన్డే, టీ20ల్లో చివరి వరకు బ్యాటింగ్‌ చేస్తే, తన సామర్థ్యాలను ఉపయోగించుకుంటే, పరిమిత ఓవర్ల క్రికెట్లో సూపర్‌ స్టార్‌ అవుతాడు’ అని వీరూ సూచించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని