నా వల్ల కాదేమోనని ఏడ్చేసేదాన్ని: పరిణీతి చోప్రా - parineeti chopra shares how she trained for saina says there were days she cried
close
Published : 18/03/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా వల్ల కాదేమోనని ఏడ్చేసేదాన్ని: పరిణీతి చోప్రా

ముంబయి: సాధారణంగా బయోపిక్‌లలో నటించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ అవి క్రీడాకారుల జీవితాలైతే.. మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడాలి. తాజాగా నటి పరిణీతి చోప్రా భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక క్రీడాకారిణిలా కనిపించాలంటే శారీరక దృఢత్వం ఎంతో అవసరం. అందుకు తగ్గట్టు పూర్తిస్థాయిలో కసరత్తులు చేయాలి. ఆ ప్రయాణంపై పరిణితి స్పందించారు.

‘రోజూ తెల్లవారుజామున రన్నింగ్‌తో నా ఫిట్‌నెస్‌ ప్రక్రియ మొదలయ్యేది. అలాగే ఒక క్రీడాకారిణిగా భావోద్వేగాలు ఎలా ఉండాలో సాధన చేసేదాన్ని. కొన్ని సార్లు బ్యాడ్మింటన్‌ కోర్టులోనే ఏడ్చేసేదాన్ని, ఈ చిత్రంలో నటించటం నా వల్ల కాదేమో అని కూడా బాధపడుతుండేదాన్ని. అంతిమంగా ఒకటే అనుకున్నా సైనాలా నటించటమే కాదు, సైనాలానే ఉండాలని. అదేంటో తెరపై మీరే చూస్తారు’అంటూ  వివరించారు. ఆ వీడియోలో ఆమెతో పాటు ట్రైనర్స్‌ కూడా ఈ ప్రయాణంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘సైనా’టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమోల్‌ గుప్టే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకులను థియేటర్‌ కోర్టులో పలకరించనుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని