ఆ సినిమా నాకొక పాఠశాల అవుతోంది: పరిణీతి - parineeti on working with ranbir and anil kapoor in animal it will be months of learning school
close
Published : 30/03/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమా నాకొక పాఠశాల అవుతోంది: పరిణీతి

ఇంటర్నెట్‌ డెస్క్: తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న రెండో  చిత్రం ‘యానిమల్‌’. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రా నటిస్తోంది. తాజాగా చిత్రం పై ఆమె స్పందిస్తూ..‘‘ఏ దర్శకుడితోనూ నటుడుతోనూ కలిసి పనిచేయాలని ముందుగా నేనెప్పుడూ అనుకోలేదు కాబట్టే నాకు ‘యానిమల్‌’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే వారి గురించి నాకు తెలుసు. ‘యానిమల్‌’ చిత్రంలో పనిచేయడం అంటే నాకు అదొక పాఠశాల అవుతుంది. దర్శకుడు సందీప్‌ అంటే నాకు ఇష్టం. వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడాను. చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా స్ర్కిప్టు నాకెంతో నచ్చిందని’’ తెలిపింది. పరిణీతి చోప్రా, రణ్‌బీర్‌ - అనిల్‌ కపూర్‌తో కలిసి నటించం ఇదే తొలిసారి. చిత్రంలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్‌ నటిస్తున్నారు. గుల్షన్‌ కుమర్‌, టీ-సీరీస్‌ సమర్పణలో భద్రకాళి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమాకి భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాతలు. పరిణీతి చోప్రా నటించిన ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై అలరించగా ‘సందీప్‌ ఔర్‌ పింకీ పరార్‌’, ‘సైనా’ చిత్రాలు మార్చిలో తెరపైకి సందడి చేశాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని