క్యారేజ్‌ ముట్టుకుంటే నా మీద ఒట్టే.. - paruchuri gopala krishna about rao gopal rao
close
Published : 13/03/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్యారేజ్‌ ముట్టుకుంటే నా మీద ఒట్టే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు అలనాటి నటులు ఎన్టీఆర్‌, రావుగోపాల్‌ రావు.. వీరంతా సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండేవారు. ఓసారి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సెట్స్‌కు వెళ్లి సీన్స్‌ చదివి వినిపిస్తున్నారు. అదే సమయంలో గోపాలకృష్ణ ఇంటి నుంచి భోజనం వచ్చింది. ఆయన సతీమణి తొక్కు పచ్చళ్లు ఎక్కువగా పెడుతుండేవారు. ఓసారి రావుగోపాల్‌ రావు ఆ వంటలను రుచిచూశారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా గోపాలకృష్ణ ఇంటి నుంచి క్యారేజ్‌ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే రావుగోపాల్‌ రావు..‘ఆ క్యారేజ్‌ని గోపాలకృష్ణతో పాటు ఎవరు ముట్టుకున్నా నా మీద ఒట్టే’ అని అరిచేశారట. ఇందుకు గోపాలకృష్ణ కూడా ఒప్పుకోక తప్పలేదు. రావుగోపాల్‌ రావు స్వయంగా భోజనం వడ్డించుకుని ఒక్కో ముద్ద తింటూ..‘ఈ ముద్ద జస్టిస్‌ చౌదరి, ఈ ముద్ద కొండవీటి సింహం, ఈ ముద్ద ఖైదీ..’ అంటూ లొట్టలేసుకుని తినేవారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని