‘వకీల్‌సాబ్‌’ రెండు సింహాలు ఢీకొనబోతున్నాయి! - paruchuri gopala krishna talks about pawan kalyan vakeel saab trailer
close
Updated : 09/04/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌’ రెండు సింహాలు ఢీకొనబోతున్నాయి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వకీల్‌సాబ్’లో పవన్‌కల్యాణ్‌-ప్రకాశ్‌ రాజ్‌ల మధ్య సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు యువ దర్శకులకు పాఠాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 9న విడుదలకానున్న ‘వకీల్‌సాబ్’ చిత్రంపై ఆయన మాట్లాడారు.

‘‘ట్రైలర్‌ చూసి ఆ సినిమా దమ్ము ఏంటో చెప్పవచ్చు. ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌ చూడగానే నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకి కచ్చితంగా ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుందని అనుకుంటున్నా. ఒక బలహీనుడు తిరగబడితే బలవంతుడిని పరిగెత్తించగలడు. ఇక్కడ ఒక బలహీనురాలి మీద ఒక బలవంతుడు చేస్తున్న కుట్రని కాపాడటానికి ఒక సింహం వచ్చింది. ఆ సింహామే పవన్ కల్యాణ్‌. సింహం వచ్చింది కదా, కథని రెండు నిమిషాల్లో తేల్చేయవచ్చు. కానీ, కథలో మరొక సింహాన్ని ఎదురుగా పెట్టారు. ఆ సింహమే ప్రకాశ్‌రాజ్‌. ‘నువ్వు కన్యవేనా’ అని ప్రకాశ్‌రాజ్‌ పాత్ర కోర్టులో అడగడం అంటే ఆ అమ్మాయి గుండె గొంతులోకి వచ్చేస్తుంది. ఇదే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభించి, చివరిలో ఇలాగే పవన్‌ కూడా మరో వ్యక్తిని అడుగుతాడు. దాంతో అబ్జెక్షన్‌ అంటాడు ప్రకాశ్‌రాజ్‌. ‘మీరు అమ్మాయిని అడగవచ్చు. కానీ, నేను అబ్బాయిని అడగకూడదా నందాజీ’’అని అంటాడు పవన్‌. ఇది చాలు సినిమా ఎలా ఉంటుందనేది తెలియడానికి. ట్రైలర్‌ చూస్తుంటే ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా ఉంది. వకీల్‌సాబ్‌ పూర్తిగా కోర్టు డ్రామా. కోర్టు డ్రామా అంటే కచ్చితంగా బోర్‌ కొడుతుంది. కానీ, ట్రైలర్‌ చూస్తే అలా అనిపించడం లేదు. అన్నం ఉడికిందా? లేదా? అనేది చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూడవచ్చు. అలా ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌ చూస్తే చాలు సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి. వకీల్‌సాబ్‌ చరిత్ర సృష్టించబోతుంది. పవన్‌ అభిమానులకు, పవన్‌ కల్యాణ్‌కి ఇవే నా శుభాకాంక్షలు’’ అంటూ తెలిపారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని