చిరాగ్‌కు షాక్: ఎల్జేపీ లోక్‌సభాపక్ష నేతగా పరాస్‌ - pashupati kumar paras recognised as ljp floor leader in lok sabha
close
Published : 15/06/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరాగ్‌కు షాక్: ఎల్జేపీ లోక్‌సభాపక్ష నేతగా పరాస్‌

ఫ్లోర్‌ లీడర్‌గా గుర్తిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ 

దిల్లీ: బిహార్‌లోని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)లో ఏర్పడిన ముసలం ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. లోక్‌సభలో ఎల్జేపీ ఫ్లోర్‌లీడర్‌గా ఆయన బాబాయి పశుపతి కుమార్‌ పరాస్‌ను గుర్తిస్తూ లోక్‌సభ సచివాలయం సోమవారం సాయంత్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎల్జేపీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు రాత్రికి రాత్రే తిరుగుబావుటా ఎగురవేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎల్జేపీ ఎంపీలు.. పార్లమెంటరీ పార్టీ నేతగా నేతగా పశుపతికుమార్‌ పరాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు తమను వేరే గ్రూపుగా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం చర్యలు చేపట్టింది. దీంతో యువనేత చిరాగ్ పాసవాన్‌ లోక్‌సభలో ఒంటరయ్యారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని