అదే గోపాల గోపాలలో నటించేలా చేసింది:పవన్‌ - pawan Kalyan wishes venkatesh
close
Published : 13/12/2020 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే గోపాల గోపాలలో నటించేలా చేసింది:పవన్‌

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్‌తో తన స్నేహం ఎంతో ప్రత్యేకమైందని పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రకటన ద్వారా మంచి మనసున్న వెంకీకి హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేశ్‌తో నాకున్న స్నేహం ఎంతో ప్రత్యేకమైంది. నేను కథానాయకుడిని కావడానికి ముందు నుంచే ఆయనతో నాకు అనుబంధం ఉంది. తరచూ వెంకటేశ్‌తో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆయన మంచి చదువరి. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో ఉన్న విషయాలు నాకు వివరించేవారు’.

‘ఆ సంభాషణలు, చర్చలే మా స్నేహాన్ని దృఢపరిచాయి. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సినిమా విషయాలతోపాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. ఆ స్నేహమే మేమిద్దరం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్రం అద్దంపట్టింది. కొత్తతరం దర్శకుల కథలకు.. ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొనే వెంకటేశ్‌ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్‌ చెప్పారు. ఆయన, వెంకీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘గోపాల గోపాల’. కిశోర్‌ కుమార్‌ పార్ధసాని దర్శకుడు. సురేశ్‌బాబు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2015 జనవరి 10న విడుదలై, ప్రేక్షకుల్ని అలరించింది.

ఇవీ చదవండి..
వెంకటేశ్‌ను మార్చేసిన ‘ప్రేమించుకుందాం రా!’
వెంకీ మనతో ఉంటే నిరాశే ఉండదు..

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని