అన్నదాతలను ఆదుకోవాలంటూ పవన్ దీక్ష - pawan kalyan Deeksha
close
Published : 07/12/2020 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నదాతలను ఆదుకోవాలంటూ పవన్ దీక్ష

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని తన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ దీక్ష చేపట్టారు. గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్‌ పర్యటించిన విషయం తెలిసిందే. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు రూ.35వేలు ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ.10వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులకు అండగా నిలిచేందుకు ఈరోజు సాయంత్రం వరకు దీక్ష చేస్తున్నట్లు పవన్‌ తెలిపారు. 

అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ జనసేనాని ఇచ్చిన పిలుపు మేరకు జనసేన, భాజపా శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీ పేట తహసీల్దారు కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ జెండాలతో సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ దీక్షకు భారతీయ కిసాన్‌ సంఘ్‌ రైతు సంఘం మద్దతు తెలిపింది. 

ఇదీ చదవండి..
ప్రభుత్వం స్పందించకపోతే దీక్ష చేస్తా: పవన్‌
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని