‘వకీల్‌ సాబ్‌’ మరో అప్‌డేట్‌ ఇచ్చారు - pawan kalyan Vakeel Saab Sathyameva Jayathe Lyrical Song from tomorrow
close
Published : 02/03/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌ సాబ్‌’ మరో అప్‌డేట్‌ ఇచ్చారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ నుంచి మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘సత్యమేవ జయతే’ అనే పాటని మార్చి 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడుగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతోంది. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 9న విడుదలకానుందీ సినిమా. కొన్నాళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. తన కెరీర్‌లో తొలిసారి లాయర్‌ పాత్ర పోషిస్తున్నారాయన. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ గీతం శ్రోతల్ని బాగా ఆకట్టుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని