మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవు: పవన్‌ - pawan kalyan and nara lokesh on guntur incident
close
Published : 05/08/2020 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవు: పవన్‌

గుంటూరు ఘటనపై పవన్‌, లోకేశ్‌ విమర్శలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఎస్సీ మహిళను ట్రాక్టర్‌తో హత్య చేయడం దారుణమన్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు అత్యాచారం కేసు నమోదులో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఏపీలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. 

15నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు: లోకేశ్‌
వైకాపా 15నెలల పాలనలో 400 అత్యాచార ఘటనలు రాష్ట్రంలో జరిగాయని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. దిశ చట్టం, ఈ-రక్షాబంధన్‌ అంటూ సీఎం జగన్ గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో ఎస్టీ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని అయితే కేసులో ఎలాంటి పురోగతి లేదని అన్నారు. కేసు నమోదుకు గిరిజన సంఘాలు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. గుంటూరు ఘటన చోటు చేసుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

గుంటూరు ఘటనపై ఎస్పీ స్పందన
నకరికల్లు మండలం శివాపురం ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ పేర్కొన్నారు. మంత్రూబాయిని ట్రాక్టర్‌తో తొక్కించినట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఆరు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలిపారు. తీసుకున్న అప్పు చెల్లించని కారణంగానే హత్య జరిగిందన్నారు. పొలం అమ్మి అప్పు తీరుస్తానని మంత్రూబాయి భర్త శ్రీనివాసరెడ్డిని కోరారని, పొలం తీసుకుని అప్పు పోగా మిగతా డబ్బు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారని వివరించారు. వినకుండా వారిపైకి ట్రాక్టర్‌ పోనీయడంతో మంత్రూబాయి చనిపోయిందని వెల్లడించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. కొందరు కేసును రాజకీయం చేయడానికి యత్నిస్తున్నారని చెప్పారు. నిందితుడిని వెంటనే పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలిపారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానంలో విచారించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడించారు. హత్య కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని