పవన్‌-రానా మూవీ: క్రేజీ అప్‌డేట్‌ ఇదే! - pawan kalyan and rana new movie update
close
Published : 15/01/2021 18:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌-రానా మూవీ: క్రేజీ అప్‌డేట్‌ ఇదే!

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్ అభిమానులకు ఈ సంక్రాంతి భలే కానుకలను తీసుకొచ్చింది. గురువారం ‘వకీల్‌సాబ్’ టీజర్‌ అదరగొట్టగా.. తాజాగా పవన్‌ తర్వాతి సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ చిత్ర బృందం విడుదల చేసింది. యువ కథానాయకుడు రానాతో కలిసి ఆయన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందం శుక్రవారం ఓ వీడియోను పంచుకుంది.

మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. అక్కడ బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌లు పోషించిన పాత్రలను ఇక్కడ తెలుగులో పవన్‌, రానా పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఇందులో కథానాయికలుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికైనట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని