మార్పు కోసమే భాజపాతో పొత్తు: పవన్‌ - pawan kalyan fires on ycp government
close
Published : 06/03/2021 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్పు కోసమే భాజపాతో పొత్తు: పవన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మార్పు తెచ్చేందుకే భాజపాతో కలిశామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా వైకాపా దౌర్జన్యాలు చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు జనసైనికులు ఎదురు నిలిచారని వెల్లడించారు. ఒత్తిళ్లు ఉన్నా జనసైనికులు ఎన్నికల బరిలో నిలిచారని పేర్కొన్నారు. మార్పు కోసమే యువత ధైర్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెప్పారు. పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును నచ్చిన పథకాల పేరుతో పంచుతున్నారని పవన్‌ ఆక్షేపించారు. అర్హులకు పింఛన్లు, పథకాలు ఆపడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రశ్నించకపోతే రాష్ట్రంలో దారుణాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయని.. వైకాపాకు ఓటేస్తే ప్రజలను యాచకులుగా మారుస్తారని వ్యాఖ్యానించారు. పథకాలు తొలగిస్తామని బెదిరిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి లొంగకుండా ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని