పవన్‌-మహేశ్‌ మొదలు పెట్టేశారు..! - pawan kalyan maheshbabu new movies shooting start sarkaruvaari paata
close
Published : 25/01/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌-మహేశ్‌ మొదలు పెట్టేశారు..!

అప్‌డేట్‌ షేర్‌ చేసిన చిత్ర బృందాలు

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తమ తదుపరి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేశారు. ఈ మేరకు వీరి కొత్త సినిమాల షూటింగ్స్‌ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయా చిత్రబృందాలు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.

హైదరాబాద్‌లో పవన్‌..
పవన్‌కల్యాణ్‌-రానా ప్రధాన పాత్రల్లో మలయాళీ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో పవన్‌కల్యాణ్‌ పాల్గొంటున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు.

దుబాయ్‌లో మహేశ్‌..
‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ నటించనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. దీని చిత్రీకరణ సోమవారం దుబాయ్‌లో ప్రారంభమైంది. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూట్‌ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా ఓ ప్రత్యేక‌ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

ఇవీ చదవండి!

చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు

ఫిబ్రవరి 26న వస్తున్న ‘అక్షర’

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని