అమిత్‌షాతో పవన్‌కల్యాణ్‌ భేటీ - pawan kalyan meets amitshah
close
Published : 10/02/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమిత్‌షాతో పవన్‌కల్యాణ్‌ భేటీ

దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. సోమవారం దిల్లీ చేరుకున్న ఆయన..  అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై వీరిద్దరూ చర్చించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని, రాష్ట్ర ప్రజల మనోభావాలు అర్థం చేసుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమిత్ షాను పవన్‌ కల్యాణ్ కోరారు. అవకాశం ఉన్నంత మేరకు అప్పులు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఏపీకి ప్రత్యేక గనులు కేటాయించాలని పవన్ కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌ పరం చేయడం వల్ల 18వేల మంది శాశ్వత, 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల మీద ప్రభావం పడుతుందని అమిత్‌ షాకు పవన్‌ తెలిపారు. అంతేకాకుండా పరోక్షంగా మరో లక్ష మంది జీవితాలపై ఈ ప్రభావం ఉంటుందని పవన్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికపైనా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. భాజపాకు చెందిన పలువురు అగ్రనేతలతోనూ పవన్‌ సమావేశమయ్యే అవకాశముంది.

ఇవీ చదవండి..

విజయాన్ని మార్చేసిన ఒక్క ఓటు

నిర్మలాసీతారామన్‌ను కలిసిన తెదేపా ఎంపీలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని