‘వకీల్‌సాబ్‌’ డబ్బింగ్‌ షురూ! - pawan kalyan starts dubbing for vakeelsaab
close
Published : 22/03/2021 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌’ డబ్బింగ్‌ షురూ!

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో పవన్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా వకీల్‌సాబ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని