‘వకీల్‌సాబ్’ ట్రైలర్‌: టాలీవుడ్‌లో ఇదో రికార్డ్‌! - pawan kalyan vakeelsaab trailer create record in tollywood
close
Published : 30/03/2021 19:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్’ ట్రైలర్‌: టాలీవుడ్‌లో ఇదో రికార్డ్‌!

ఇంటర్నెడెస్క్‌: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. సోమవారం య్యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మరే సినిమా ట్రైలర్‌ సాధించనన్ని రికార్డులను ‘వకీల్‌సాబ్’ సృష్టించింది.

24 గంటల్లో 22.44 మిలియన్‌ వ్యూస్‌(రియల్‌ టైమ్‌ వ్యూస్‌)ను దక్కించుని టాలీవుడ్‌ అత్యధిక వీక్షణలను సొంతం చేసుకున్న ట్రైలర్‌గా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. అంతేకాదండోయ్‌ అతి తక్కువ సమయంలో 1మిలియన్‌ లైక్స్‌ను సొంతం చేసుకున్న ట్రైలర్‌గానూ రికార్డు క్రియేట్‌ చేసింది.

శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.  బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథలో చాలా మార్పులు చేశారు.  ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని