#PSPK27 సందడి షురూ - pawankalyan resumed shooting pspk27
close
Published : 12/01/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#PSPK27 సందడి షురూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలాకాలం తర్వాత తిరిగి మేకప్‌ వేసుకున్న పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ సినిమాల వేగం పెంచారు. ఆయన నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’ ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కాగా.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే తర్వాతి సినిమాకు పనిచేసేందుకు సిద్ధమయ్యారాయన. #PSPK27 అనే వర్కింగ్‌ టైటిల్‌తో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర యూనిట్‌తో వపన్‌ కలవనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా అభిమానులతో పంచుకుంది. ‘ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. పవన్‌కల్యాణ్‌ గారు #PSPK27 షూటింగ్‌ను పునఃప్రారంభించారు’ అని ఓ పోస్టు చేసింది.

గతేడాది ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ కరోనా వైరస్‌ ప్రభావంతో నిలిచిపోయింది. ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో షెడ్యుల్‌ ప్రకారం.. పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’లో నటించారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో ఇప్పుడు క్రిష్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. కాగా.. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్‌ విడుదల చేశారు. ఎ.ఎం.రత్నం నిర్మాత. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..

చీరకట్టి.. పల్టీలు కొట్టిన హీరోయిన్‌




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని