close

తాజా వార్తలు

Updated : 23/05/2020 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రామాయణ్‌’ ఎవరు చూస్తారని నవ్వారు!’

ప్రసార భారతి సీఈవో

దిల్లీ: విశేష ప్రజాదరణ పొందిన బుల్లితెర ధారావాహిక ‘రామాయణ్‌’ను పునఃప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో కొందరు నవ్వారని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్‌ తెలిపారు. ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ఈ సీరియల్‌ ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరోసారి ప్రసారమైన ఈ ధారావాహిక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన సీరియల్‌గా రికార్డు నెలకొల్పింది. ఏప్రిల్‌ 16న ఈ షోను మొత్తం 7.7. కోట్ల మంది వీక్షించారు.

అయితే ఈ సీరియల్‌ను ఉద్దేశించి శశి శేఖర్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘‘రామాయణ్‌’ పునఃప్రసారం గురించి ప్రకటించినప్పుడు ఇప్పుడు ఈ సీరియల్‌ ఎవరు చూస్తారు? అని వాట్సాప్‌ గ్రూపుల్లో జోక్‌లు వేసుకున్నారు. వారికి నా శైలిలో సమాధానం ఇచ్చా. భారత దేశం ఎంతో ప్రత్యేకం. ఇక్కడి వారు ఇంగ్లిష్ మాట్లాడే ఉన్నత వర్గం మాత్రమే కాదు.. వైవిధ్యమైన అభిప్రాయాలు ఉన్నవారు కూడా అని చెప్పా’’ అని ఆయన పేర్కొన్నారు.

అనంతరం 33 ఏళ్ల క్రితం నాటి ‘రామాయణ్‌’ టేప్‌ గురించి మాట్లాడుతూ.. ‘ముంబయిలోని రామానంద్‌ సాగర్‌ ఇంట్లో ‘రామాయణ్‌’ టేప్‌ ఉంది. దాన్ని ఎన్నో ఏళ్ల క్రితమే భద్రంగా దాచారు. పునఃప్రసారం చేయాలి అనుకున్నప్పుడు కర్య్ఫూ అమలులో ఉంది. మేం వాళ్ల ఇంటికి వెళ్లి టేప్‌ తీసుకున్నాం. అప్పటి ఫార్మాట్‌కు, ఇప్పటి ఫార్మాట్‌కు ఎంతో తేడా ఉంది. అప్పటి ఫైల్‌ సైజ్‌ చాలా పెద్దది. కాబట్టి ఇంటర్నెట్‌ ద్వారా దాన్ని పొందడం కష్టం. మా వద్ద ఉపగ్రహ ఆధారిత యంత్రాంగం ఉంది. దాని ద్వారా ముంబయిలో ఉన్న కంటెంట్‌ను ఇక్కడి సర్వర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నాం. అలా ప్రతి రోజు ఎపిసోడ్‌ ప్రసారమయ్యేది’ అని శశి శేఖర్‌ అన్నారు. ఈ లాక్‌డౌన్‌లో దూరదర్శన్‌ వ్యూయర్‌షిప్‌ పెరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన