కరోనా పరీక్షలు తప్పించుకునేందుకు పరుగులు - people ran to avoid covid test in bihar
close
Published : 17/04/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా పరీక్షలు తప్పించుకునేందుకు పరుగులు

పట్నా: బిహార్‌లోని బక్సర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణికులు పరుగులు పెడుతున్న ఫొటో ఇది. స్టేషన్‌లో ఎవరైనా బాంబు పెట్టారా? లేక కాల్పులు జరుపుతున్నారా..! అందుకే వీరు భయంతో పారిపోతున్నారా? అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే వీరు పరుగులు పెడుతున్నది కరోనా పరీక్షల నుంచి తప్పించుకునేందుకు..! ఆరోగ్య సిబ్బంది ఎక్కడ తమను ఆపి టెస్టులు చేస్తారేమో అన్న భయంతో రైలు దిగగానే ఉరుకులు పరుగుల మీద స్టేషన్‌ బయటకు వెళ్లిపోతున్నారు. 

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో లాక్‌డౌన్‌ భయాలతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన బిహార్‌ వాసులు తిరిగి సొంతూళ్ల బాటపట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అయితే ఇతర ప్రాంతల నుంచి సొంతూళ్లకు వచ్చే వారికి రైల్వేస్టేషన్లలోనే కరోనా పరీక్షలు నిర్వహించాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆదేశించారు. దీంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

అయితే పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు గానీ.. చాలా చోట్ల టెస్టులు చేయించుకోడానికి జనం భయపడుతున్నారు. బక్సర్‌ రైల్వే స్టేషన్‌లో కొవిడ్‌ పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు రైలు దిగగానే ఇలా పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ప్రతి రోజూ ఇలాంటే పరిస్థితే ఎదురవుతుందని, పరీక్షలు చేయించుకోమని అడిగితే తమతో గొడవ పెట్టుకుంటున్నారని స్థానిక వైద్యారోగ్య సిబ్బంది చెబుతున్నారు. రద్దీని అదుపుచేసేందుకు పోలీసులు కూడా అందుబాటులో ఉండట్లేదని వాపోతున్నారు. వలస కార్మికుల్లో ముంబయి, పుణె, దిల్లీ నుంచి వస్తున్నవారే అధికంగా ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని