వంటొచ్చినోడిని పెళ్లి చేసుకుంటే సరి - people told me i should know how to cook vidya balan on facing gender inequality
close
Published : 13/06/2021 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంటొచ్చినోడిని పెళ్లి చేసుకుంటే సరి

ముంబయి: వంటను ఆడవాళ్లే చేయాలనే నియమం ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తోంది విద్యాబాలన్‌. మహిళలకు సంబంధించిన ఏ సమస్యపైనానా సూటిగా గళం విప్పే నటీమణుల్లో విద్యాబాలన్‌ ఒకరు. తాజాగా ఓ ఇంటర్య్వూలో లింగ వివక్ష గురించి ఆమె మాట్లాడింది. ‘‘స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. స్త్రీలు అంటే వంటగదికే పరిమిత అయ్యేవాళ్లు కాదు. నాకు బాగా గుర్తు ఏంటంటే ఓసారి ఇంటికొచ్చిన అతిథులతో కలిసి భోజనం చేస్తుండగా..‘నీకు వంట రాదు కదా’ అని ఎగతాళిగా మాట్లాడారు. ‘నాకే కాదు మా ఆయన సిద్ధార్థ్‌ కూడా రాదు’అని చెప్పాను. ‘లేదు నువ్వు నేర్చుకుంటేనే బాగుంటుంది’అని ఆ వ్యక్తి మళ్లీ సలహా ఇచ్చాడు. ‘ఎందుకని సిద్ధార్థ్‌కు నాకూ మధ్య తేడా ఉండాలి’’అని సమాధానం చెప్పేసరికి ఆయన ఇక ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచీ ఇంతే నేను. మా అమ్మ వంట నేర్చుకోమని పోరు పెడుతుంటే ‘‘అవసరమైతే వంటమనిషిని పెట్టుకుంటా. లేదంటే వంట వచ్చినవాణ్ని పెళ్లి చేసుకుంటే సరిపోయేదానికి పదేపదే చెప్పడం అవసరమా’ అని అమ్మతో వాదించేదాన్ని’’అని చెప్పింది విద్యాబాలన్‌. ఆమె అటవీ అధికారిణిగా నటించిన ‘షెర్నీ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని