వ్యాక్సినేషన్‌లో మరో ముందడుగు - people vaccinated against covid-19 more than double number of active cases
close
Published : 19/01/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సినేషన్‌లో మరో ముందడుగు

క్రియాశీల కేసుల కంటే రెట్టింపుగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య

దిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల కంటే ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,54,049 మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, ప్రస్తుతం దేశంలో 2,00,528 క్రియాశీల కేసులున్నట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరగడంతో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గటం వల్ల గణాంకాలు త్వరగా మారుతున్నాయని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 2,23,669 మందికి వ్యాక్సిన్‌ వేశామన్నారు. మరోవైపు, దేశంలో కరోనా విజృంభణ అనంతరం ఏడు నెలల తర్వాత 24గంటల వ్యవధిలో తొలిసారి నిన్న 10,064 కరోనా పాజిటివ్‌ కేసులు; ఎనిమిది నెలల  తర్వాత 137 మరణాలు నమోదు కావడం ఉపశమనం కలిగించే అంశమని పేర్కొన్నారు. కరోనా టెస్టులు పెరగడంతో వైరస్‌ను త్వరగా గుర్తించి వ్యాప్తి చెందకుండా చూస్తున్నామన్నారు. దీంతో వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించారు. గత 24గంటల్లో 17,411 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. వారిలో కేరళలో అత్యధికంగా 3921మంది, ఆ తర్వాత మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో అత్యధికంగా కోలుకున్నారు.

ఇవీ చదవండి..

భారత్‌:గణనీయంగా తగ్గిన పాజిటివ్‌ కేసులు

లక్షద్వీప్‌నూ తాకిన కరోనా..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని