సైనస్‌ సర్జరీ.. ఆ కొవిడ్‌ టెస్టుకు దూరం..! - people who have undergone sinus surgery should avoid covid-19 nasal swab test
close
Published : 09/03/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సైనస్‌ సర్జరీ.. ఆ కొవిడ్‌ టెస్టుకు దూరం..!

వాషింగ్టన్‌: కొవిడ్‌ -19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను నిర్ధారించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్వాబ్‌ పద్ధతిలో నమూనాలను సేకరిస్తోన్న విషయం తెలిసిందే. పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సైనస్‌ సర్జరీ చేయించుకున్న వారు మాత్రం కొవిడ్‌ టెస్టుకు ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
కొవిడ్‌ టెస్టులో భాగంగా స్వాబ్‌(ముక్కు లేదా గొంతు) ద్వారా శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తారు. అయితే కరోనా పరీక్ష కోసం వచ్చేవారికి సైనస్ లేదా పుర్రె(స్కల్‌) సంబంధిత సర్జరీ జరిగిందా అని స్వాబింగ్ సిబ్బంది నిర్ధారించుకోవాలని శాన్‌ ఆంటానియోలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌ ఎండీ, ఫిలిప్‌ జి.చెన్‌ చెప్పారు. అలా సర్జరీ చేసుకున్న వారికి కరోనా టెస్టు చేయాల్సి వస్తే.. వారు గొంతు ద్వారా స్వాబ్‌ టెస్ట్‌ చేసుకోవాలని చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఈ మేరకు సైనస్‌ సర్జరీ అయినవారు కరోనా పరీక్ష సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆన్‌లైన్‌లో స్పష్టమైన సమాచారం లేదని ఆయన వివరించారు. కరోనా పరీక్ష కోసం ఉపయోగించే స్వాబ్‌ పరికరాలలో ముక్కును శుభ్రపరిచే స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీంతో అది సర్జరీ చేసుకున్నవారి ముక్కు, పుర్రె (స్కల్) భాగంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో సైనస్‌ బాధితులు (సర్జరీ అయినవారు) నేరుగా స్వాబింగ్ చేసుకోవడం ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని