కరోనా ఉద్ధృతి: వచ్చే 4వారాలు చాలా కీలకం - peoples participation vital to control 2nd wave of pandemic next four weeks very critical for us
close
Published : 06/04/2021 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఉద్ధృతి: వచ్చే 4వారాలు చాలా కీలకం

వైరస్‌ నియంత్రణ.. ఇంకా మన చేతుల్లోనే: కేంద్రం

దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి తీవ్రత నానాటికీ పెరుగుతోందని, గతంలో కంటే వేగంగా వైరస్‌ వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అయితే కరోనా పట్ల నిర్లక్ష్య ధోరణే మహమ్మారి విజృంభణకు కారణమవుతోందన్న కేంద్రం.. ఇప్పటికీ మనం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపింది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరింది. 

దేశంలో కరోనా పరిస్థితులను కేంద్ర ఆరోగ్యశాఖ నేడు మీడియాకు వివరించింది. ‘‘దేశంలో మహమ్మరి తీవ్రంగా ఉంది. గతంలో కంటే వేగంగా వ్యాప్తిస్తోంది. అందుకే కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటించడంలో పెరిగిన నిర్లక్ష్యం ఈ పరిస్థితికి దారితీసింది. అయితే వైరస్‌ మరింత విస్తరించేందుకు మనం అవకాశం ఇవ్వకూడదు. కరోనా నియంత్రణ ఇంకా మన చేతుల్లోనే ఉంది. అన్ని రాష్ట్రాలు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలి’’అని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. 

వచ్చే నాలుగు వారాలు కీలకం

దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతిని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని ఆరోగ్యశాఖ తెలిపింది. వచ్చే నాలుగు వారాలకు చాలా కీలకమైన సమయమని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు 50 ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపినట్లు రాజేశ్ భూషణ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. మహారాష్ట్రలోని 30, ఛత్తీస్‌గఢ్‌లోని 11, పంజాబ్‌లోని 9 జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి.. రాష్ట్ర యంత్రాంగాలకు తగిన సూచనలు చేస్తాయని వివరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని