ఆ టీకాలతో తొలి డోసుకే 80శాతం రక్షణ! - pfizer moderna vaccines highly effective even after 1st shot study
close
Published : 30/03/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ టీకాలతో తొలి డోసుకే 80శాతం రక్షణ!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌కు సంబంధించి ఫైజర్‌, మోడెర్నా టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఓ నివేదిక తెలిపింది. ఈ టీకాలు మొదటి డోసుకే కొవిడ్‌ ముప్పును 80 శాతం దూరం చేస్తాయని రియల్‌ వరల్డ్‌ అనే సంస్థ పరిశోధన నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ అమెరికాలో అనుమతి పొందిన వ్యాక్సిన్ల రక్షణ సామర్థ్యంపై.. టీకా తీసుకున్న దాదాపు 4వేల మందిపై పరిశోధన నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.

‘ఫైజర్‌, మోడెర్నా టీకాలు ప్రభావంతంగా పనిచేస్తున్నాయి. తొలిడోసు మాత్రమే తీసుకున్న వారిలో 80శాతం మేర ముప్పును తగ్గిస్తున్నాయి. ఇక రెండు డోసులు తీసుకున్న వారిలో 90శాతం వైరస్‌ ముప్పును నివారిస్తున్నాయి’ అని రియల్‌ వరల్డ్‌ పరిశోధన తెలిపింది. ఈ అధ్యయనంలో ఆరు రాష్ట్రాలకు చెందిన టీకా తీసుకున్న 3950 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌  13 వారాల పాటు పాల్గొన్నారు. కాగా, ఈ తాజా పరిశోధన నివేదికల ద్వారా తమ వ్యాక్సినేషన్‌ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నిరూపితమవుతోందని సీడీసీ డైరెక్టర్‌ రోచెల్‌ వాలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని