ఫైజర్‌ టీకా: భారత వేరియంట్లపై పనిచేస్తుందా..? - pfizer vaccine on indian variant
close
Published : 20/04/2021 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫైజర్‌ టీకా: భారత వేరియంట్లపై పనిచేస్తుందా..?

ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ఏమందంటే..

జెరూసలేం: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోన్న వేళ.. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్‌లు సవాల్‌గా మారాయి. ఈ కొత్తరకాలను ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటాయా అనే కోణంలో ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వేరియంట్‌పై ఫైజర్‌ టీకా పాక్షికంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్‌ కేసులు ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో ఎనిమిది నమోదైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో పంపిణీ చేస్తోన్న ఫైజర్‌ వ్యాక్సిన్‌ వీటిపై పనిచేస్తున్నట్లు విశ్వసిస్తున్నామని.. అయితే, కాస్త తక్కువ సామర్థ్యం కలిగివుందని ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ హెజీ లెవీ పేర్కొన్నారు. ఇదేవిధంగా బ్రిటన్‌, ఐర్లాండ్‌లలోనూ భారత వేరియంట్‌లు వెలుగు చూశాయని ఆయా దేశాలు వెల్లడించాయి. ఈ వేరియంట్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపాయి.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడంలో ఇజ్రాయెల్‌ ప్రపంచ దేశాల్లోనే ముందుంది. దాదాపు 93లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్‌లో 16ఏళ్ల వయసు పైబడిన వారిలో ఇప్పటికే 81శాతం మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. వీరిలో 55శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్‌ (రెండు డోసులు) తీసుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని