‘వాలిమై’లో అజిత్‌ స్టంట్‌ చూశారా..?  - photos from azith movie valimai sets
close
Updated : 28/11/2020 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వాలిమై’లో అజిత్‌ స్టంట్‌ చూశారా..? 

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా.. సినిమా సెట్స్‌ నుంచి ఒక అదిరిపోయే ఫొటో బయటికి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ ఫొటోలో హీరో అజిత్‌ బైక్‌పై స్టంట్‌ చేస్తూ కనిపించాడు. ముందు చక్రాన్ని గాల్లోకి లేపి బైక్‌ నడిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాకు హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్రం కరోనా వల్ల ఆగిపోయింది. లాక్‌డౌన్‌ ముగియడంతో పాటు ప్రభుత్వం చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ చిత్ర బృందం సెట్స్‌కు చేరుకుంది. ఇటీవల బైక్‌ స్టంట్‌ చేస్తున్న క్రమంలో అజిత్‌కు గాయమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడే అజిత్‌పై పలు యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రాన్ని బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. ఇందులో హ్యుమా కూరేషి, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు.

 మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని