నలుగురు డైరెక్టర్స్‌.. నాలుగు కథలు - pitta kathalu trailer out now
close
Updated : 20/01/2021 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నలుగురు డైరెక్టర్స్‌.. నాలుగు కథలు

ఆకట్టుకునేలా ‘పిట్ట కథలు’ ట్రైలర్‌

హైదరాబాద్‌: తరుణ్‌ భాస్కర్‌, నందిని రెడ్డి, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌ రెడ్డి.. విభిన్న కథా చిత్రాలతో వెండితెర వేదికగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ నలుగురు దర్శకులు అతి త్వరలోనే ఓటీటీ వేదికగా మెప్పించనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘పిట్ట కథలు’ పేరుతో ప్రసారం కానున్న ఓ వెబ్‌ సిరీస్‌కు వీళ్లు నలుగురు దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. నాలుగు విభిన్నమైన కథలతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో శ్రుతిహాసన్‌, ఇషా రెబ్బా, అమలాపాల్‌, జగపతిబాబు, సత్యదేవ్‌, మంచులక్ష్మి కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న ‘పిట్ట కథలు’ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘పిట్ట కథలు’ ట్రైలర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. హిందీలో ప్రేక్షకాధరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’కు రీమేక్‌గా ‘పిట్ట కథలు’ వస్తోందని సమాచారం.

ఇదీ చదవండి

వీడియో లీక్‌.. రూ.25 కోట్లు డిమాండ్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని