ఏప్రిల్‌ 23న విడుదలకానున్న ‘ప్లాన్ బి’ - plan b movie release on april 23
close
Published : 20/03/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏప్రిల్‌ 23న విడుదలకానున్న ‘ప్లాన్ బి’

హైదరాబాద్‌: హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ప్లాన్‌ బి’. కె.వి.రాజమహి దర్శకత్వంలో ఈ సినిమాని ఏవీఆర్‌ మూవీ వండర్స్ నిర్మిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తమ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యు/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసిందని దర్శకుడు రాజమహి తెలిపారు. చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఏవీఆర్‌ ప్రకటించారు. ఇంకా చిత్రంలో సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, అభినవ్ సర్దార్, చిత్రం శీను, షాని తదితరులు నటిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని