రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌.. ఎంత పెరిగిందంటే? - platform ticket price raised from rs 10 to rs 30
close
Updated : 05/03/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌.. ఎంత పెరిగిందంటే?

దిల్లీ: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను భారీగా పెంచుతూ ప్రకటన జారీ చేసింది. ఇదివరకు రూ.10గా ఉన్న ప్లాట్‌ఫాం ధరలను ఏకంగా రూ.30కి పెంచింది. దీంతో ఒకేసారి రూ.20 పెరిగినట్లయింది. అయితే ఈ ధరలను తాత్కాలికంగా మాత్రమే పెంచినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. కరోనా వాప్తి కట్టడి తమ బాధ్యత అని పేర్కొన్న రైల్వే శాఖ రైల్వేస్టేషన్లలో గుమిగూడడాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలపై ఇటీవల సమీక్షించిన రైల్వే బోర్డు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను వెంటనే అమల్లోకి తేవాలని అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని