ప్లీజ్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌ మాస్క్‌ ధరించండి: సత్యదేవ్‌ - please please please wear mask says actorsatyadev
close
Published : 27/05/2021 22:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్లీజ్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌ మాస్క్‌ ధరించండి: సత్యదేవ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఏ ఒక్కరి సమస్యనో కాదని.. ఇది మనందరి సమస్య. కాబట్టి అందరం బాధ్యతగా ఉంటూ సమస్యను పరిష్కరించుకుందాం అని నటుడు సత్యదేవ్‌ అన్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియోను ‘ఆరోగ్యఆంధ్ర’ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పంచుకుంది. అందులో సత్యదేవ్‌ మాట్లాడుతూ.. కరోనాను ఎదుర్కోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఉండాలని కోరారు.

‘‘నమస్కారం. కరోనా.. ఈ సమస్య మీదో.. నాదో.. ప్రభుత్వానిదో కాదు. ఇది మనందరి సమస్య. సమస్య మనందరిది అయినప్పుడు దానికి పరిష్కారం చూడటం మనందరి బాధ్యత. కరోనా రెట్టింపును ఆపడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ముక్కు, గడ్డం మూసివేస్తూ మాస్క్‌ ధరించడం. తరచుగా చేతులు శానిటైజ్‌ చేసుకోవడం. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇతరుల నుంచి భౌతికదూరం పాటించడం. అలాగే.. ప్రభుత్వం చెప్పినట్లుగా వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం.. ఇలాంటివి చేయడం ద్వారా కరోనా రెట్టింపుకాకుండా ఆపగలం. ప్లీజ్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. మాస్క్‌ ధరించండి. మిమ్మల్నీ.. మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి. జై హింద్. - అని సత్యదేవ్‌

షార్ట్‌ఫిల్మ్స్‌తో తన కెరీర్‌ ప్రారంభించిన సత్యదేవ్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ యాక్టర్‌గా ఎదిగారు. విభిన్న కథాంశాలతో చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘తిమ్మరుసు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రియాంక జావల్కర్‌ హీరోయిన్‌. దీంతో పాటు గోపి గణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గాడ్సే’లోనూ సత్యదేవ్‌ నటిస్తున్నారు. ఆ తర్వాత మరో చిత్రం ‘గుర్తుందా సీతాకాలం’లో చేసేందుకు సంతకం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని