‘వైల్డ్‌డాగ్‌’ చూసి నా సినిమా‌ చూడండి: కార్తీ - please watch sulthan after wilddog on april 2nd says karthi
close
Published : 01/04/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైల్డ్‌డాగ్‌’ చూసి నా సినిమా‌ చూడండి: కార్తీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘మా అన్నయ్య నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ చూసిన తర్వాత మా ‘సుల్తాన్‌’ చూడాలని’’ అని కథానాయకుడు కార్తీ అన్నారు. బాక్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా ‘సుల్తాన్‌’ తెరకెక్కుతోంది. రష్మిక మందాన హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. 

ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ.. ‘‘నా సినిమా బాగా ఆడాలని ఆశీస్సులు అందించిన మా అన్నయ్య నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన సినిమా వైల్డ్‌డాగ్‌ పెద్ద హిట్‌ కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. ఆయనతో కలిసి ‘ఊపిరి’ చేశాను. ఆ సినిమా చేసే సమయంలో డైరెక్టర్‌ వంశీ గారు ఎంత కష్టపడ్డారో చూశాను. ఆయన అనుకున్న సన్నివేశం కోసం ఎంతో టెన్షన్‌ పడుతుంటారు. ‘మహర్షి’కి నేషనల్‌ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ‘సుల్తాన్‌’ గురించి మాట్లాడాలంటే.. ఈ సినిమా ప్రయాణం 2017 మేలో మొదలైంది. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ బాక్యరాజ్‌ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాలో ‘ఖైదీ’లో ఉన్న యాక్షన్‌ ఉంది. ‘ఊపిరి’లో ఉన్న ఎమోషన్‌ ఉంది. ‘ఆవారా’లో ఉన్న రొమాన్స్‌ ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివెక్‌ ఇచ్చిన సంగీతంతో ఈ సినిమా ఒక పూర్తి స్థాయి ప్యాకేజీలా తయారైంది. ఇక నేషనల్‌ క్రష్‌ రష్మిక గురించి చెప్పాలంటే.. ఎంత క్రేజ్‌ ఉన్నా ఆమె ఎంతో సింపుల్‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. ఏప్రిల్‌ 2న మా అన్నయ్య సినిమా ‘వైల్డ్‌డాగ్‌’ చూసిన తర్వాత మా సినిమా చూడండి’ అని కార్తీ అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని