బెంగాల్‌ ప్రజలను దీదీ మోసగించారు: మోదీ - pm modi attacks didi at kolkata rally
close
Updated : 07/03/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌ ప్రజలను దీదీ మోసగించారు: మోదీ

కోల్‌కతా: బెంగాల్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ఇక్కడి ప్రజల్ని మోసం చేశారని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రాబోయే 25 ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి వచ్చే ఐదేళ్లలో పునాది వేస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్‌ నుంచి దోచుకున్నదంతా తిరిగి తెస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువరించిన తర్వాత ఇక్కడి బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానంలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో మమత హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని మోదీ ఆరోపించారు. ఆ వ్యవస్థలన్నింటినీ భాజపా పునరుద్ధరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజలకు మళ్లీ నమ్మకం ఏర్పడేలా చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి 24×7  కష్టపడతామని భరోసా ఇచ్చారు. ‘‘ప్రజలంతా మిమ్మల్ని ‘అక్క’గా నమ్మి మీకు ఓటేస్తే.. మీరు మేనల్లుడికి ‘అత్త’లా వ్యవహరిస్తున్నారు’ అంటూ మమతపై నేరుగా మోదీ విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన దీదీని తాను చూశానని.. ఇప్పుడు ఆమె వేరొకరి భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు కాకుండా విభజన వైపు నడిపించారని, మతం ఆధారంగా ప్రజలను విభజించాలని చూశారు కాబట్టే ఇక్కడ కమలం వికసించిందని ప్రధాని మోదీ అన్నారు. తాను 130 కోట్ల మంది స్నేహితుల కోసం పనిచేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. కొందరు స్నేహితుల కోసమే మోదీ పనిచేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని