దేశ ప్రజలకు ప్రధాని హోలీ శుభాకాంక్షలు - pm modi holi greetings to the nation
close
Published : 29/03/2021 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశ ప్రజలకు ప్రధాని హోలీ శుభాకాంక్షలు

దిల్లీ: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండగతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేశ ప్రజలందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు. హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలి. ఈ పండగ అందరిలో కొత్త శక్తిని నింపుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా దేశ ప్రజలకు ట్విటర్‌ ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఆరోగ్యాలను ప్రసాదిస్తుందని వారు అభిలషించారు.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని