Gulab cyclone: ‘గులాబ్‌’ తుపాను పరిస్థితిపై జగన్‌తో మాట్లాడిన ప్రధాని - pm modi speaks to ap cm jagan about gulab cyclone
close
Published : 26/09/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gulab cyclone: ‘గులాబ్‌’ తుపాను పరిస్థితిపై జగన్‌తో మాట్లాడిన ప్రధాని

అమరావతి: ‘గులాబ్‌’ తుపాను పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్‌’ తుపాను తీరంవైపు కదులుతోంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 140కి.మీ, ఏపీలోని కళింగపట్నానికి 190కి.మీ దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ దిశగా ముందుకెళ్తోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లా అంతటా ఆకాశం మేఘావృతం కావడంతో పాటు పలుచోట్ల తేలికపాటి వర్షం పడుతోంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈరోజు అర్ధ రాత్రికి కళింగపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో 75-90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని