కుంభమేళాను ప్రతీకాత్మకంగానే జరపండి: మోదీ  - pm modi urges to keep kumbh participation symbolic amid covid crisis
close
Updated : 17/04/2021 12:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుంభమేళాను ప్రతీకాత్మకంగానే జరపండి: మోదీ 

దిల్లీ: దేశంలో కరోనా రెండో దశ విజృంభణ ఉద్ధృతంగా ఉన్న సమయంలో హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై స్పందించారు. ప్రస్తుత మహమ్మారి కఠిన పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగానే జరపాలంటూ సాధువులను కోరారు. 

కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ ఇవాళ... జునా అఖాడాహెడ్‌ స్వామి అవధేశానంద్‌ గిరితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్యసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కుంభమేళాను కుదించేలా చూడాలని మోదీ ఆయనను కోరారు. 

‘‘రెండు షాహీ స్నాన్‌(రాజ స్నానాలు) పూర్తయ్యాయి కనుక ఇప్పుడున్న కరోనా సంకట పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా(భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించడం) జరపాలని స్వామి అవధేశానంద్‌ గిరిని ప్రార్థించాను. ఈ నిర్ణయం మహమ్మారిపై పోరాటానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది’’అని మోదీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. 

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో నిత్యం లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇటీవల ఏప్రిల్‌ 12, 14 రోజుల్లో జరిగిన షాహీ స్నాన్‌లలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కుంభమేళాను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కుంభమేళాలో పాల్గొన్న అనేక మంది భక్తులతో పాటు పలు అఖాడాలకు చెందిన సాధువులు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో కొన్ని అఖాడాలు స్వచ్ఛందంగా హరిద్వార్‌ను వీడేందుకు సిద్ధమయ్యాయి. 

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో కుంభమేళాను ముగిస్తున్నట్లు నిరంజని అఖాడా ప్రకటించింది. అయితే దీనిపై మిగతా అఖాడాలకు చెందిన సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. సాధారణంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు కుంభమేళా జరగాల్సి ఉండగా.. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది దీన్ని కుదించి ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని