అపోహలు తొలగించేందుకే ముందుగా ప్రధానికి టీకా - pms move to get inoculated would instil confidence among people remove hesitancy: guleria
close
Published : 01/03/2021 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అపోహలు తొలగించేందుకే ముందుగా ప్రధానికి టీకా

ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా

దిల్లీ: ప్రజల్లో టీకాపై ఉన్న అపోహలను తొలగించేందుకే ప్రధాని ముందుగా టీకా తీసుకున్నారని ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. సోమవారం నుంచి దేశంలో రెండోదశ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా అరవైఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా అందించనున్నారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా..

ప్రధాని మోదీ టీకా తీసుకోనున్న విషయం ఆదివారం రాత్రి ఎయిమ్స్‌ నిర్వాహకులకు సమాచారమిచ్చారని డైరక్టర్‌ గులేరియా తెలిపారు. ‘‘సాధారణంగా సోమవారం రద్దీగా ఉంటుంది కాబట్టి ప్రధాని ఉదయాన్నే వచ్చి టీకా తీసుకుంటారని తెలిపారు. త కోసం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దని ప్రధాని సూచించారు. రెండో దశ ప్రారంభమైన మొదటి రోజే ప్రధాని టీకా తీసుకొని ప్రజల్లో టీకాపై ఉన్న సంకోచాన్ని తగ్గించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. కరోనాతో పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి.’’ అని గులేరియా వెల్లడించారు. ప్రధానికి భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకాను అందించినట్లు ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం ప్రధాని బాగానే ఉన్నారన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం అరగంటు పాటు ఆయన్ని పరిశీలనలో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. మోదీకి వ్యాక్సిన్‌ అందించిన నర్సు నివేదాకు ఆ విషయం సోమవారం ఉదయమే తెలిపామన్నారు.

మార్చి 1 నుంచి రెండో దశ టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం గత బుధవారం ప్రకటించింది. దేశంలో మొత్తం 10 వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నట్లు వెల్లడించారు. 20 వేల ప్రైవేటు కేంద్రాల్లో డోసుకు రూ.250 చొప్పున అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారు కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా నేరుగా వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్లి అక్కడ కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని