ఫైన్‌కు బదులు కిస్‌‌‌.. అధికారిపై వేటు!  - police officer suspended for kissing woman instead of fine
close
Updated : 20/02/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫైన్‌కు బదులు కిస్‌‌‌.. అధికారిపై వేటు! 

లిమా: అసలే ఇది కరోనా కాలం. ఈ మహమ్మారి భయంతో ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికీ అనేక దేశాలు కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఓ మహిళపై చర్యలు తీసుకోవాల్సిన ఓ అధికారి జరిమానాకు బదులు ఆమెకు ముద్దు పెట్టి సస్పెండ్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పెరూ రాజధాని లిమాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కరోనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఓ మహిళను పోలీస్‌ అధికారి అడ్డుకున్నారు. అయితే, ఫైన్‌ నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించే క్రమంలో ఆ మహిళ అతడికి చాలా దగ్గరిగా వెళ్లింది. ఫైన్‌కు బదులు అతడిని ముద్దుకు ఒప్పించేందుకు యత్నించింది. ఈ క్రమంలో తొలుత అతడు నిరాకరించినా ఆ తర్వాత కొద్ది సెకెన్లలోనే మనసు మార్చుకొని ఆమెను ముద్దు పెట్టుకోవడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో మిరాఫ్లోర్స్‌  మేయర్‌ లూయిస్‌ మొలినా దృష్టికి వెళ్లింది. దీంతో అతడి నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేసిన మేయర్‌..  ఆ పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారని సిటిజన్‌ సెక్యూరిటీ ఇంఛార్జి ఐబెరో రాడ్‌గ్రూయిజ్‌ తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ ఘటనలో అధికారి అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డాడని మేయర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ మహిళ కూడా భౌతిక దూరం నిబంధనల్ని ఖాతరు చేయకపోగా.. ఆమె దగ్గరకు వచ్చేందుకు అతడు అనుమతించాడన్నారు. ఆ మహిళను ముద్దు పెట్టుకొనేందుకు అధికారి మాస్క్‌ కూడా తీయడంపైనా మండిపడినట్టు అక్కడి మీడియా పేర్కొంది. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని, అతడి చర్య చాలా తీవ్రమైనది గనకే సస్పెండ్‌ అయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, లాటిన్‌ అమెరికా దేశాల్లో కరోనా కేసులను పరిశీలిస్తే పెరూలోనే వైరస్‌ తీవ్ర ఎక్కువగా ఉంది. ఇప్పటికే 1.2మిలియన్ల కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 44వేల మంది ఈ వైరస్‌ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని